18/11/2023
24,25 న జరిగే కలామ్స్ విజన్- 2023 సైంటిఫికల్ ప్రాజెక్ట్ ఎక్స్ పో ను విజయవంతం చేయండి
రాయచోటి శాసనసభ్యులు , ఆంధ్రప్రదేశ్ శాసనసభ వ్యవహారాల సమన్యయకర్త
గడికోట శ్రీకాంత్ రెడ్డి .
నవంబర్ 24, 25 వ తేదీన రాయచోటిలోనీ ఇంటర్నేషనల్ మెరిట్ హై స్కూల్ నందు నిర్వహించబోయే కలామ్స్ విజన్-2023 సైంటిఫికల్ ప్రాజెక్ట్ ఎక్స్ పో ను విజయవంతం చేయాలని రాయచోటి శాసనసభ్యులు , ఆంధ్రప్రదేశ్ శాసనసభ వ్యవహారాల సమన్యయకర్త
గడికోట శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. శనివారం పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయం నందు ప్రోగ్రాం డైరెక్టర్ వినయ్ కుమార్ రూపొందించిన కలామ్స్ విజన్ సైంటిఫికల్ ఎక్స్ పో కరపత్రాన్ని ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఆవిష్కరించారు. విద్యార్థులలో శాస్త్రీయ ఆలోచనల పెంపొందించడానికి సైంటిఫికల్ ప్రాజెక్ట్ ఎక్స్ పో ఉపయోగకరంగా ఉంటుందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ఉండే హైస్కూల్ విద్యార్థిని విద్యార్థులు సద్వినియోగం చేసుకొని విజయవంతం చేయాలని ఆయన తెలిపారు. అనంతరం
ప్రోగ్రాం డైరెక్టర్ వినయ్ కుమార్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఉండే ప్రైవేట్, కార్పొరేట్ గవర్నమెంట్ , విద్యార్థిని విద్యార్థులు అందరూ తమ ప్రాజెక్టులను ప్రదర్శించవచ్చు .రిజిస్ట్రేషన్ కొరకు 6281453550, 9391932752 నంబర్లకు సంప్రదించవచ్చు అన్నారు.
ప్రాజెక్ట్ రూపొందించిన ప్రతి విద్యార్థికి ప్రశంస పత్రం మరియు జ్ఞాపకా అందజేస్తున్నట్లు తెలిపారు . ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ఉండే ప్రతి ఒక్క పాఠశాల నుండి విద్యార్థిని విద్యార్థులు పాల్గొని సద్వినియోగం చేసుకోవాలని వినయ్ కుమార్ కోరారు . ఈ కార్యక్రమం లో ఎలక్ట్రిసిటీ డి ఈ మరియు పి ఆర్ టి యు రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాసరాజు, తదితరులు పాల్గొన్నారు .