30/07/2019
శుంగ సామ్రాజ్యం
క్రీ.పూ 185 నుండి 75 వరకు
-----------------------------------------------
శుంగ సామ్రాజ్యం పురాతన భారత రాజవంశం, క్రీ.పూ 187 నుండి 78 వరకు మగధ నుండి మధ్య, తూర్పు ప్రాంతాల్లో భారత ఉపఖండంలో వీరి పాలన సాగింది. మౌర్య సామ్రాజ్యం పతనం తరువాత ఈ రాజవంశం పుష్యమిత్ర శుంగుడుచే స్థాపించబడింది. దీని రాజధాని పాటలీపుత్ర, కానీ తరువాత భాగభద్రా వంటి చక్రవర్తులు కూడా తూర్పు మాల్వా లోని బేస్నగర్ లో దర్బారును నిర్వహించారు
శుంగ సామ్రాజ్యం
185 BCE నుండి75 BCE వరకు కొనసాగింది.
శుంగ వంశము, క్రీ. పూ. 185 వ సంవత్సరములో, సుమారుగా అశోకుని మరణానికి 50 సంవత్సరాల తరువాత, ఏర్పాటు చేయబడింది. అప్పటి మౌర్య చక్రవర్తియైన బృహద్రథుడు, తన సైన్యాధిపతి చేతిలో దారుణంగా హత్యచేయబడ్డాడు. ఆ సైన్యాధిపతి పుష్యమిత్ర శుంగుడు, శుంగవంశము వాడు; బ్రాహ్మణుడు. ఇతను సైనిక వందనం స్వీకరించుతున్న రాజు బృహద్రధుని చంపి, తరువాత సింహాసనాన్ని అధిష్టించాడు.
పుష్యమిత్ర శుంగుడు 36 సంవత్సరాల పాటు పాలించాడు. ఆ తర్వాత అతని కుమారుడు అగ్నిమిత్ర రాజ్యాధికారం చేపట్టాడు. శుంగ సామ్రాజ్యంలో పదిమంది శుంగ పాలకులు ఉన్నారు. అయితే, రాజవంశం యొక్క రెండవ రాజు అగ్నిమిత్ర మరణం తరువాత, సామ్రాజ్యం వేగంగా విచ్ఛిన్నమైంది.
శాసనాలు మరియు నాణేలు ప్రకారం ఉత్తర; మధ్య భారతదేశం యొక్క ప్రాంతాలు చిన్న సామ్రాజ్యాలుగా, నగర-రాజ్యాలుగా శుంగ ఆధిపత్యంలో ఉండి స్వతంత్రంగా ఉన్నాయని సూచించబడ్డాయి.
ఈ రాజవంశం అనేక విదేశీ శక్తులు, స్వదేశీ శక్తులు రెండింటితోనూ జరిపిన యుద్ధాలకు ప్రసిద్ధి చెందింది. వీరు కళింగ, శాతవాహన రాజవంశం, ఇండో-గ్రీక్ రాజ్యంతో; బహుశా పాంచాల మరియు మధుర రాజులతో పోరాడారు.
ఈ కాలంలో కళ, విద్య, తత్వశాస్త్రం మరియు ఇతర రకాల అభ్యాసాలు, చిన్న చిన్న టెర్రకోట చిత్రాలు, పెద్ద రాతి శిల్పాలు, భహ్రుత్ స్తూపం, సాంచి వద్ద ప్రఖ్యాత గ్రేట్ స్తూపం ఉన్నాయి. శుంగ పాలకులు శిక్షణ, కళలకు రాయల్ స్పాన్సర్షిప్ సంప్రదాయం ఏర్పాటుకు సహాయం చేశారు. శుంగ సామ్రాజ్యం ఉపయోగించే లిపి, బ్రాహ్మీలిపికి కొంత విభిన్నంగా ఉంటుంది; ఇది సంస్కృతం వ్రాయడానికి ఉపయోగించబడింది. హిందూ తాత్వికతలో చాలా ముఖ్యమైన పరిణామాలు జరుగుతున్న కాలంలో శుంగ సామ్రాజ్యం సంస్కృతి పోషణలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించింది. వీరి కాలంలోలోనే పతంజలి మహాభాష్యం రచించబడింది. శుంగ పాలకుల కాలంలో మధుర కళ శైలి పెరుగుదలతో పాటు కళాత్మకత కూడా పురోగమించింది,
చారిత్రక స్మృతులతో ...
-------------------------------------------------
మీ...
విష్ణు భగవాన్
తాడిపత్రి, అనంతపురం జిల్లా
Cell:9963032665.